31-01-2025 12:00:00 AM
భారత ప్రభుత్వం దేశంలోని ప్రముఖ వ్యక్తులకు ఇచ్చే పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను రాజకీయం చేయడం భావ్యం కాదు. అందరికీ నచ్చేవారికే అవార్డులు ఇస్తామంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక్కొక్కరు ఒక్కో రంగంలో అద్వితీయమైన సేవలు చేసిన వారే కదా! తెలంగాణ ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన వారిని కేంద్ర సర్కారు ఎంపిక చేయకపోవడం సత్సంప్రదాయం కాదు.
ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ను కౌగిలించుకొని ఫొటోలు దిగినప్పుడు లేని భావజాల సమస్య ఇప్పుడే గుర్తుకు రావడం రాజకీయం కాక మరేమిటి? కేంద్రం పెద్దన్నలా వ్యవహరిస్తే ఎంతో హుందాగా ఉంటుంది.
డా. ఎస్. విజయభాస్కర్, హైదరాబాద్