calender_icon.png 6 February, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాటలు హద్దుమీరొద్దు!

06-02-2025 12:34:05 AM

  1. పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తప్పవు
  2. బీసీ సంఘాలు ప్రతిపక్షనేతల ట్రాప్‌లో పడొద్దు 
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 
  4. బీసీలపై బీఆర్‌ఎస్‌కు ప్రేమ లేదు: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణతో బీసీ, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల చొరవతో బీసీ కులగణన, ఎస్సీ వర్గకరణకు మోక్షం ల భించిందని,  స్వాతంత్య్రం వచ్చిన తర్వా త బీసీ కులగణన జరిగిన ఏకైక రాష్ర్టం తెలంగాణే అని తెలిపారు.

పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడిన చర్యలు తప్పవని, పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. బుధవారం గాంధీభవన్‌లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి మీడియాతో మాట్లాడుతూ..  బీహార్‌లాంటి రాష్ట్రాలు కులగ ణన చేపట్టినా కార్యరూపం దాల్చలేదన్నారు.

కులగణన సర్వేపై ప్రతిపక్షాలు విమర్శలకు బదులు సలహాలు, సూచనలు చేస్తే బాగుంటుందని సూచించా రు.  శాస్త్రీయపద్ధతిలో కులగణన సర్వే జరిగిందని, 56 శాతంపైగా బీసీలు ఉన్నారని సర్వేలో తేలిందన్నారు. బీసీ సంఘాలను బీఆర్‌ఎస్ నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని, ప్రతిపక్ష నేతల ట్రాప్ లో బీసీ సంఘాలు పడొద్దని సూచించారు. 

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రెండు కులాల ప్రతినిధిగా చెబుతున్నా.. కుల గణన ఒక చరిత్ర అని చెప్పారు.  బీసీల సంఖ్య పెరుగుతున్నా వారికి సామాజిక న్యాయం జరగడం లేదన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టిందన్నారు.

కులగణనపై సభలో చర్చకు అనుమతించామని, కానీ బీఆర్‌ఎస్ నేతలు మధ్యలోనే వెళ్లిపోవడంతో బీసీలపై వారికి ఏపాటి ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు.