23-04-2025 01:42:34 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మూడేళ్లలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, రేవంత్‌రెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశా రు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ రిపోర్టుతో లగచర్ల బాధ్యులైన పోలీసులను సర్వీస్ నుంచి తొలగించాలని, బాధితులకు న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.
చర్యలు తీసుకోకపోతే ఈ ఘటనకు కర్త కర్మ క్రియ రేవంత్ అండ్ కో అనుకోవాల్సి వస్తుందని అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక సీఎం రేవంత్‌రెడ్డి చెంప మీద కొట్టిన ట్లు ఉందని అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక తర్వాత లగచర్ల బాధితులు మంగళవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ సభ కోసం వారు లక్ష రూపాయల విరాళాన్ని కేటీఆర్‌కు అందజేశారు.
ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మా ట్లాడుతూ.. లగచర్ల ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించారు. మా నవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక చెప్పినందున రేవంత్‌రెడ్డికి బాధ్యత ఉంటే రాజీనామా చేసి క్షమాపణలు కోరేవారని అన్నారు. అది లేదు కను కనే ఇంకా సీఎంగా కొనసాగుతున్నారని విమర్శించారు. వరంగల్ సభ కోసం లగచర్ల బాధితులు విరాళం ఇవ్వడం సంతోషం కలిగించిందన్నారు.
గిరిజన రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించారని, హీర్యానాయక్ గుండెనొప్పి ఉన్నా బేడీలు వేసి ఆస్ప త్రికి తీసుకుపోయిన నీచప్రభుత్వమన్నారు. మానవ మృగల్లాగా కొందరు పోలీసులు ప్రవర్తించారని ఆరోపించారు. ప్రశ్నించిన తమ పార్టీ నేత నరేందర్‌ను నెలరోజులకు పైగా అక్రమంగా జైల్లో పెట్టారని మండిపడ్డా రు. ఈ ప్రభుత్వంలో లాకప్పుల్లోని సీసీటీవీ లు పనిచేయడం లేదన్నారు.
హైకోర్టులో స్టే ఉన్నా లగచర్లలో ప్రబుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లుగా తమకు సమాచారం ఉందని కేటీఆర్ చెప్పారు. ఈ ఘటనలన్నింటికీ సీఎంగా, హోంమంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, వివరాలు సేకరించి మానవత్వం మిగిలే ఉందని భావించేలా ఎన్‌హెచ్‌ఆర్సీ నివేదిక ఉందన్నారు.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు భారీగా విరాళాలు
వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు గులాబీ నేత లు విరాళాలు భారీగా ఇస్తున్నారు. పార్టీ సభ కు తాము స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్న ట్లు నేతలు చెప్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు రూ.6 లక్షల విరాళం అందజేశారు.
వన్‌సాఫ్ట్ సిస్టమ్స్ అధినేత సుభాష్ లక్ష రూపాయల విరాళం అందజేసినట్లు పార్టీ నేతలు చెప్పా రు. సామాన్య కార్యకర్తల నుంచి పార్టీ సీనియర్ నేతలు, పార్టీ అభిమానులు భారీగా విరాళాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈసందర్భంగా వరంగల్ సభ పోస్టర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానందగౌడ్,మల్కాజ్‌గిరి లోక్‌సభ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.