26-02-2025 12:00:00 AM
ఎంపీడీవో వెంకయ్య
చేవెళ్ల, ఫిబ్రవరి 25: గ్రామాల అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య హెచ్చరించారు. మంగళవారం మండల పరిషత్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామా భివృద్ధి, పరిశుభ్రత, పన్ను వసూలు, లేబర్ మోబిలైజేషన్ పై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
రహదారులు, డ్రైనేజీలు శుభ్రంగా ఉంచ డంతో పాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని సూచించారు. గ్రామ పంచాయతీ రోజువారీ చెత్త వేరు చేసి ఎరువులను తయారీకి వాడాలన్నారు. నర్సరీల నిర్వహణలో భాగంగా 100 శాతం షేడ్ నెట్లు వేసి.. మొక్కలను కాపాడాల న్నారు.
పన్ను వసూళ్ల ప్రక్రియలో భాగంగా 3 గంటలలోపు కలెక్షన్ చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని నిర్ణయించారు. అలాగే, గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో లేబర్ మోబిలైజేష్ప ప్రత్యేక దృష్టి పెట్టాలని, లబ్ధిదారులకు తప్పనిసరిగా గోతులు తవ్వాలని ఆదేశించారు.