29-03-2025 12:32:53 AM
ప్రశాంతంగా పది పరీక్షలు అయ్యేలా చూడండి
జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్ మార్చి 28 (విజయ క్రాంతి) : పది పరీక్షల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్ హై స్కూల్, క్రీస్తుజ్యోతి హై స్కూల్ వంటి పరీక్షా కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. అలాగే, పరీక్షా కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
పరీక్షా హాల్లో క్రమశిక్షణ పాటిస్తూ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పరీక్షా హాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావొద్దని స్పష్టం చేశారు.