21-04-2025 12:00:00 AM
స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేనారెడ్డి
ఆదిలాబాద్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి) : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను గుర్తించి క్రీడల్లో వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందుకు స్పోర్ట్స్ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేం ద్రానికి వచ్చిన ఆయన ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని స్పోర్ట్స్ స్కూల్ ను సందర్శించారు.
ఈ సందర్భంగా స్కూల్లో ఉన్న సమస్యలను స్వయంగా డి.వై.ఎస్.ఓ వెంకటేశ్వర్లు ను అడిగి తెలుసుకున్నారు. స్పోర్ట్స్ పాఠశాలలోని విద్యార్థుల కు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్య త అధికారులపై ఉందని, ఆ దిశగా వారికి సౌకర్యాలు కల్పించడంలో వెనకడుగు వేయద్దన్నారు.
స్కూల్‌లో కావలసిన సౌకర్యాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తానని చైర్మన్ స్పష్టం చేశారు. కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, యువజన కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు గోడే అవినాష్, కిసాన్ కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు గాన్ శ్యామ్ తదితరులు ఉన్నారు.