బెల్లంపల్లి, సెప్టెంబర్ 27: బెల్లంపల్లి నూ తన కూరగాయల మార్కెట్ భవనానికి మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) పే రు పెడితే సహించేది లేదని బెల్లంపల్లి ము న్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ హెచ్చరి ంచారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎ స్ హయాంలో గెలుపొందిన మున్సిపల్ అ ధ్యక్షురాలు జక్కుల శ్వేత కాంగ్రెస్ పార్టీకి వం త పాడుతూ కాకా పేరు పెట్టాలని మాట్లాడ టం సిగ్గు చేటన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో మార్కెట్ భవ నాన్ని నిర్మించారని, ఈ భవనానికి కాకా పేరు పెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామ న్నారు. అమృత్ పథకంలో భాగంగా రూ.61.58 కోట్ల నిధులతో గత ప్రభుత్వం కేంద్రం ద్వారా మంజూరు చేయించిన ఎల్లం పల్లి తాగునీటి పథకాన్ని తానే తీసుకువచ్చి నట్లు ఎమ్మెల్యే వినోద్ గొప్పలు చెప్పుకో వడం తగదన్నారు.
బెల్లంపల్లి ప్రజలు డెం గ్యూ, విషజ్వరాలతో బాధపడుతుంటే ఎమ్మె ల్యే హైదరాబాద్‌లోనే ఉంటున్నారని విమర్శి ంచారు. బెల్లంపల్లిలోనే పూర్తికాలం ఉంటా నని బాండ్ పేపర్ రాసిచ్చిన ఎమ్మెల్యే కనీస ం ఒక్కరోజు కూడా నిద్ర చేయడం లేదన్నా రు.
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రా క్టు ఉద్యోగాలు పెట్టిస్తామని ప్రజల నుంచి పె ద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నార ని బీఆర్‌ఎస్ నాయకులు బీఆర్‌ఎస్ నేత నూనేటి సత్యనారాయణ ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బ్రోకర్ల హవా నడుస్తున్నదని విమర్శించారు. సమా వేశంలో బీఆర్‌ఎస్ నాయకులు సబ్బని రాజే ంద్రప్రసాద్, మద్దెల గోపి, సాజిద్, ఆలీబా య్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.