సిరిసిల్ల, నవంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నడుపుతోందని బీసీ సంక్షేమ, రవాణ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం తెల్లవారు జామున వేములవాడ ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కుల గణనపై అపోహలు వద్దని, ఎన్యూమనేటర్లు ఉత్సహంగా సర్వేలో పాల్గొంటున్నారని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్య వేదికలపై విమర్శలు చేయాలని, లేదంటే పత్రికలు, మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేయాలని లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలన్నారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పదే పదే తనను అరెస్ట్ చేయాలంటున్న కేటీఆర్.. అరెస్ట్ చేస్తే ప్రజల్లో సానుభూతిపొందవచ్చని అనుకుంటున్నాడని విమర్శించారు.