calender_icon.png 23 November, 2024 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్‌లో సర్వే వివరాల నమోదులో తప్పిదాలు చేయోద్దు

22-11-2024 09:07:08 PM

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్,(విజయక్రాంతి): ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల స్థితిగతులను విశ్లేసించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు.

ఒక్కో ధరఖాస్తు వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు ఎంత సమయం పడుతుందని కలెక్టర్ ప్రశ్నించగా, సుమారు 15 నిమిషాల వ్యవధి అవుతోందని ఆపరేటర్లు తెలిపారు. ఎన్యుమరేటర్, సూపర్‌వైజర్, లింక్‌ను జతపరుస్తూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామన్నారు. నిబంధనలకు పక్కగా పాటిస్తూ అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ హితువు పలికారు.

త్వరితగతిన ఆన్లున్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని, శిక్షణ సందర్బంగా సూచించిన అంశాలను తు.చ. తప్పకుండాపాటించాలన్నారు. ఎలాంటి పోరపాట్లు తప్పిదాలకు ఆస్కారం లేకుండా చిత్తశుద్తితో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు సందర్భంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైనా సాంకేతికపరమైన సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయితే వెంటనే అధికారుల దృష్టికి తెవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు.