calender_icon.png 25 February, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా గ్రామాలను మున్సిపల్‌లో కలపొద్దు

25-02-2025 12:00:00 AM

చేవెళ్ల, ఫిబ్రవరి 24 : చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ, పల్గుట్ట గ్రామాలను చేవెళ్ల మున్సిపాలిటీలో కలుపొద్దని రెండు గ్రామాలను చెందిన ప్రజలు, నేతలు కోరారు. ఈ మేరకు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. కందవాడ, పల్గుట్ట గ్రామాలను చేవెళ్ల మున్సిపల్లో కలుపాలని కొందరు నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసిందని మండిపడ్డారు. 

చేవెళ్లను ఇప్పటికే 8 గ్రామాలతో మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారని, దాన్ని అలాగే కొనసా గించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తమ గ్రామాల జోలికి రావొద్దని,  గ్రామ పంచా యతీలుగానే ఉంచాలని  రిక్వెస్ట్ చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో కందవాడ మాజీ ఎంపీటీసీ, బీఆర్‌ఎస్ నాయకుడు రవీంద ర్యాదవ్, గ్రామస్తులు, స్థానిక నాయకులు ఉన్నారు.