calender_icon.png 3 April, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీలో విలీనం చేయొద్దు

25-03-2025 12:48:37 AM

 ప్రభుత్వానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వినతి 

మేడ్చల్, మార్చి 24(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో రింగ్ రోడ్డుకు లోపల ఉన్న మున్సిపాలిటీలను జిహెచ్‌ఎంసి లో విలీనం  చేయొద్దని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు.

అసెంబ్లీలో జీరో అవర్ లో మాట్లాడుతూ గతంలో 61 గ్రామపంచాయతీ ఉండేవని, వాటన్నింటినీ మున్సిపాలిటీలలో విలీనం చేయడం సంతోషించదగిన విషయం అన్నారు. కానీ వాటన్నింటినీ జిహెచ్‌ఎంసి లో విలీనం చేస్తారని ప్రజలు భయపడుతున్నారు. గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా చేసి వెంటనే జిహెచ్‌ఎంసి లో విలీనం చేయొద్దు అన్నారు. ఈసారి మున్సిపాలిటీలు గానే కొనసాగించాలని, దీనిపై జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.