calender_icon.png 23 December, 2024 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలీనం చేయకండి.. కలెక్టర్‌కు మొర

22-12-2024 02:40:12 AM

కరీంనగర్, డిసెంబర్21(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో   తమ గ్రామాలను విలీనం చేయొద్దని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించిన కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్, మరియు గోపాలపూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు. శనివారం రోజున ఆయా గ్రామానికి చెందిన గ్రామస్థులు జిల్లా కలెక్టర్ ను  కార్యాలయంలో కలసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా రైతు నాయకులు మంద రాజమల్లు మాట్లాడుతూ... కరీంనగర్ మునిసిపల్ కార్పోరేషన్ కొరకు గ్రామ పంచాయితి లుగా ఉన్న మా యొక్క వ్యవసాయ ఆధారిత గ్రామాలు అయిన దుర్షెడ్ ‘‘ గోపాల్ పూర్ గ్రామలను విలీనం చేయుటకు ఆర్డినెన్స్ జారిచేసినదాన్ని రద్దు పరిచి... మాయోక్క రెండు గ్రామాలను గ్రామ పంచాయితిలుగానే ఉంచుటకు కొరకు రైతులు  నిరుపేద ప్రజలము జిల్లా కలెక్టర్ గారిని కలసి  వినతి పత్రం అందజేశామని..

అదేవిధంగా ఫ్యాక్స్ ద్వార తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ పంంపినట్టు తెలిపారు. ముఖ్యంగ మా గ్రామాల్లో వ్యవసాయం చేసేవారే అధికంగా ఉన్నారని, ఉపాది హామీ కూలీలు మరియు ఇతరత్రా వ్యవసాయ కూలి పనులు చేసుకొని జీవిస్తున్నారని... అలాంటి గ్రామాలను మునిసిపల్ కార్పోరేషన్లో విలీనం చేయుటకు గాను బి.సి మంత్రి కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని..

ఆరు గ్రామాలను కరీంనగర్ పట్టణంలో విలీనం చేయుటకు ఆర్డినెన్స్ జారి చేసా రని మాకు తెలిసినది. దీన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు కూడ గతంలో చేపట్టినట్టు గుర్తు చేశారు.ఐనా కూడ ప్రభుత్వం స్పందించకుండ నిన్న అసెంబ్లీ లో బిల్ పెట్టాడాన్ని  మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

ముఖ్యంగా మాగ్రామాలలో వ్యవసాయం, కూలి పనులు మరియు ఉపాది హామీ పనులు చేసుకొని జీవనోపాది పొందుతున్నవారు అధికంగా ఉన్నారని... మునిసిపల్ కార్పోరేషన్ లో కలిపితే మేము ఉపాది హామీ పనులు చేసుకోవడానికి వీలులే కుండా మరియు ఎలాంటి ఉపాది పొంద కుండ ఉండే పరిస్తితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. మేము మధ్య తరగతి ప్రజలం.

మేము ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు కట్టే పరిస్తితి లేదు, నగరపాలక సంస్థలో మా గ్రామాలను కలిపితే...ఇంటి పన్ను, ఇంటి నిర్మాణా పర్మిషన్ కొరకు ఎక్కువ రుసుంలు కట్టుకొనే పరిస్తితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు విలీనం అయిన గ్రామాలకు ప్రభుత్వం ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని... మరియు ఎలాంటి అభివద్ధి జరగలేదన్నారు.

దీన్ని దష్టిలో పెట్టుకొ నైనా ప్రభుత్వం విలీనం ఆపాలని డిమాండ్ చేసారు. లేనిచో రాబోవు కాలంలో  మరింత ఉదతంగా పోరాటం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో... దుర్షెడ్ సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి, గోపాల పూర్ మాజీ సర్పంచ్ ఊరడి మంజుల మల్లారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ లు సుంకిశాల సంపత్ రావు,  అరె  శ్రీకాంత్, మాజీ సింగల్ విండో చైర్మన్ మంద రాజమల్లు, మాజీ వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ,   కోరు కంటి వెంకటేశ్వర రావు, శ్రీరామోజు తిరుపతి, గోనె నరసయ్య, ముత్తునూరి రాజ కమల్, గుండేటి కుమార్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.