calender_icon.png 28 December, 2024 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ పొరపాట్లొద్దు!

06-12-2024 12:00:00 AM

ఇంట్లో వాళ్లు చూసినా పెళ్లి సంబంధమైనా, ఆఫీసులో మనసుకు నచ్చిన అబ్బాయైనా ఇలా ఎవరో ఒకరు నచ్చడం, వారికి మీరు నచ్చడం వల్ల ఒక బంధం మొదలవుతుంది. అయితే బంధం మొదట్లో ఏం మాట్లాడాలి అనే భయం ఉండటం వల్ల తడబడి ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు కొందరు. కానీ ఈ తీరు వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులొస్తాయంటున్నారు నిపుణులు. అవతలి వారి మెప్పు పొందాలని.. గొప్ప కోసం అన్ని పనులూ చేసేసి, ఉన్నవీ లేనివి చెప్పి.. వాళ్లపై అతి ప్రేమ కురిపించేయొద్దు.

ఎందుకంటే తర్వాత సమస్యలు తలెత్తుతాయి. ఇద్దరూ మాట్లాడుకునే అవకాశం రాగానే, మీ భవిష్యత్తు ప్రణాళిక గురించి ఎదుటివారితో గడగడా చెప్పేయొద్దు. ఇలాంటి విషయాలు మొదటి పరిచయంలోనే కాకుండా ఇద్దరి మధ్య కొంత చనువు పెరిగాక మాట్లాడుకోవడం మంచిది. భాగస్వామి వద్ద నిజాయితీగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ కొన్ని విషయాల గురించి అసలు మాట్లాడుకోకపోవడమే మంచిది. మాటల్లో మీ పాత స్నేహాల గురించి ప్రస్తావించి అవతలి వారి మనసులో అనుమానాలు రేకెత్తించవద్దు. మీ ఇష్టాల గురించి మాత్రమే సంభాషించుకోండి. అలాగే గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం వల్ల మీకు ఎటువంటి పని లేదు అనే భావన వారిలో కలుగుతుంది. వాటిని కాస్త తగ్గించుకుంటేనే మంచిది.