calender_icon.png 23 October, 2024 | 7:00 PM

ఈ తప్పులు చేయకండి!

01-10-2024 12:00:00 AM

* చాలామంది అందంగా కనిపించడానికి ఏవేవో క్రీములు వాడుతూ ఉంటారు. కానీ అలాంటివి అస్సలు వాడకూడదు. అవి వాడటం వల్ల చర్మం పాడవుతుంది.

* కొంతమంది చక్కెరను ఫేస్ స్క్రబ్‌గా వాడుతుంటారు. ఇలా తరచూ చేయడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. 

* వంట సోడాను చర్మంపై రాయటం వల్ల పొడిగా మారి దెబ్బతింటుంది. దాల్చిన చెక్కను నేరుగా చర్మంపై ఉపయోగిస్తే హాని కలుగుతుంది. 

* నిమ్మరసం నేరుగా చర్మంపై రాస్తే చిరాకు కలుగుతుంది. అలాగే నల్లమచ్చలు పెరిగే ప్రమాదం ఉంది. గడువు దాటిన సన్ స్కిన్ లోషన్‌న్ను కూడా చర్మంపై అప్లు చేయకూడదు. 

* వేడి నీరు కూడా చర్మాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంది. వేడి నీటికి బదులుగా గోరు వెచ్చటి నీటిని వాడటం మంచిది.

* నిమ్మరసం చర్మానికి వాడటం వల్ల చర్మం పాడవుతుంది. అందుకని నిమ్మరసం ఫేస్‌కి అస్సలు అప్లు చేయకూడదు. 

* దాల్చిన చెక్క పౌడర్ అంటేనే చాలా వేడి పదార్థం. అలాంటిది మనం ఫేస్‌కి అప్లు చేస్తే ఫేస్ పాడవుతుంది. 

* వంట సోడా కూడా అస్సలు ఫేస్‌కు మాత్రం వాడకూడదు. ఎందుకంటే ఫేస్ పాడైపోయి నల్ల మచ్చలు, ముడతలు వంటి సమస్యలు వస్తాయి. అందుకని పైన చెప్పిన పదార్థాల్ని ఫేస్‌కి అస్సలు వాడకూడదు.