calender_icon.png 17 January, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేలో పొరపాట్లకు తావీయొద్దు

17-01-2025 01:05:14 AM

 అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్

రాజేంద్రనగర్, జనవరి 16 : రేషన్ కార్డులు, రైతు భరోసా సర్వేపై అధికారులు క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాటునకూ తావీయొద్దని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. గురువారం ఆమె శంషాబాద్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గండిగూడ లో రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకటరెడ్డి, శంషాబాద్ తహసిల్దార్ రవీందర్ దత్ తో కలిసి  క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలియజేశారు.   కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.