26-02-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, ఫిబ్రవరి 25: జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించేందుకు చీఫ్ సూపరిన్ టెండెంట్లు పూర్తి బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం సమావేశం హాలు నందు విద్యాశాఖ ఆధ్వర్యంలో చీఫ్ సూపరి న్ టెండెంట్లు మరియు మండల విద్యాధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. మార్చి 21 తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని, అప్పటిలోపు అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సుమారు 12903 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు కలెక్టర్ తెలిపారు.
పరీక్షల నిర్వహణలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రేణుకా దేవి తదితరులు పాల్గొన్నారు.