కొండపాక, ఫిబ్రవరి 7 : విద్యార్థి దశ లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జడ్జి స్వాతి రెడ్డి అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కుకునూర్ పల్లి మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మహిళకున్న చట్టాల పై అవగాహన కార్యక్రమం కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హజరైన ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యార్థులు నిత్యజీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురు కాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలువస్తే వాటిని అధిగమించడానికి చట్టాలు తొడ్పాడు తాయని సూచించారు.
పోక్సో చట్టం, సమాచార హక్కు చట్టం, మోటారు వాహనాల చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, జువైనైల్ జస్టిస్ యాక్ట్, ఉచిత న్యాయసేవా సహాయంపై విద్యార్థులకు తెలిపారు. మీ చుట్టు బాల్య వివాహా బాధితులు,
బాల కార్మికులు ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే స్థానిక తహసీల్దార్ , పోలీస్ అధికారి, మండల లీగల్ సర్వీసెస్ కార్యాలయం, ఫోన్ ద్వారా తెలుపవచ్చని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంలో సంప్రదించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో తోగుట సీఐ షేక్ లతీఫ్ , మండల విధ్యాధికారి బచ్చలి సత్తయ్య , కుకునూర్ పల్లి ఎస్ ఐ పి శ్రీనివాస్ విద్యార్థులు తదితరులు ఉన్నారు.