కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడకూడదని.. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, అబ్దుల్‌కలాం లాంటి మహానుభావులంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారన్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు డ్యుయల్ డెస్క్‌లు, టాయిలెట్ క్లీనింగ్ మెషీన్ల్లను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలన్నారు. పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణానికి ఎన్ని నిధులు కావాల్సి వచ్చినా మంజూరు చేస్తానన్నారు. తరగతిగదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు, పాఠశాలకు పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.