జలమండలి ఎండీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7(విజయక్రాంతి): వేసవిలో నీటిఎద్దడి రానివ్వకుండా తగిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జేఈఏ, టీజీవో, టీఎన్జీవో, ఫైనాన్స్ వింగ్ డైరీలను ఈడీ మయాంక్ మిట్టల్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేవవిని సమర్థంగా ఎదుర్కోవడానికి ఫిబ్రవరి 15 నుంచి జూన్ 15 వరకు.. 120 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వివరించారు. జలమండలి ఉద్యోగులు మరింత కష్టపడాలని పేర్కొన్నారు. ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ డైరెక్టర్లు స్వామి, అమరేందర్ రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, జేఈఏ అధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.