02-03-2025 12:00:00 AM
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, సినిమా థియేటర్లలో ఇలా అన్నింటిలో లిఫ్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. అపార్ట్‌మెంట్లలో పైఅంతస్థులకు వెళ్లడానికి లిఫ్ట్ ఉపయోగిస్తున్నారు. కానీ అనుకోని కారణాల రీత్యా అవి మొరాయించినప్పుడు ముఖ్యంగా పిల్లలకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకే కనీస జాగ్రత్తలు చెబుతూఉండాలి.
* పిల్లలతో లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు బటన్లను ఆన్, ఆఫ్ చేస్తుంటే అలా చేయకూడదని చెప్పాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలను లిఫ్ట్‌లో ఒంటరిగా ఎక్కడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదు.
* లిఫ్ట్ తలుపులు ఓపెన్ కాకముందే కొంతమంది పిల్లలు వాటిని బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తుంటారు. కాని అలా చేస్తే ఫలితం ఉండదు. ఆటోమేటిక్ లిఫ్ట్ తలుపులు తెరుచునే వరకూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. లిఫ్ట్ దిగేటప్ఫుడు ముందుగా పిల్లలు, పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వాలి.
* సడన్‌గా ఆగిపోతే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లిఫ్ట్ స్టాప్ బటన్‌ను నొక్కాలి. లిఫ్ట్ సడెన్‌గా ఆగిపోతే ఎలాంటి కంగారు, టెన్షన్ పడకూడదు. వార్నింగ్ అలారం బటన్ నొక్కితే క్షణాల్లో బయటి నుంచి సహాయం అందుతుంది. బలవంతంగా లిప్ట్ తలుపులు తెరవడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించకూడదు.
* అలాగే క్లోజ్ అవుతున్న లిఫ్ట్ తలుపులను చేతులతో ఆపడానికి ట్రై చేయకూడదు. ఒక్కోసారి లిఫ్ట్ సెన్సర్ పనిచేయకపోతే చేతులు తలుపుల మధ్య ఇరుక్కుపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో సాయం పొందడానికి ఫోన్ ద్వారా ఇరుక్కుపోయిన విషయం తెలియజేయాలి.