02-03-2025 12:00:00 AM
ఫ్రిజ్ ఉంది కదా అని చాలామంది ఎన్నో పదార్థాలను నిల్వ ఉంచుతారు. వాటిని వాడక, పడేయక అలాగే ఉంచుతుంటారు. ఎక్కువకాలం ఫ్రిజ్‌లో ఉంచారంటే అందులో ఉండే పోషకాలు తగ్గిపోతాయి.
* వండినవి తాజాగా తినడం ఉత్తమం. మిగిలిన కూరలను మర్నాడు తింటే పరవాలేదు. మూడు రోజులు గనుక నిలువ ఉంచారంటే అది విషతుల్యమవుతుంది. మసాలా కూరలు, సలాడ్స్ మరీ ప్రమాదం.
* పాలు, చీజ్ లాంటి హై ప్రొటీన్ ఉన్న పదార్థాలకు బ్యాక్టీరియా చేరుతుంది. అందువల్ల వాటిని వెంటనే ఉపయోగించాలి.
* చేపలు, రొయ్యలు, పచ్చి మాంసం లాంటివి నిలువ ఉంచి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది.
* అన్నం, పాస్తా, దుంపలు వంటివి ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
* మర్నాడు పని సులువవుతుందని కూరగాయలను కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచినా బ్యాక్టీరియా చేరుతుంది.