12-03-2025 12:04:32 AM
కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించాయి. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. న్యూ ఏజ్ కమర్షియల్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్‌ను తాజా ఇంటర్వ్యూలో హీరో కిరణ్ అబ్బవరం పంచుకున్నారు.
“దిల్ రూబా’ సినిమా నిన్న ఫైనల్ గా చూసుకున్నాం. మూవీ ఔట్ పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్‌గా ఉ న్నాం. ఈ సినిమా చూసి ఉమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది. మిగతా వారితో పాటు ఫీమేల్ ఆడియన్స్ ‘దిల్ రూబా’ను బాగా ఇష్టపడతారు. 2 గంటల 20 నిమిషాల మూవీలో ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరు.
‘క’ కంటే ముందు చేసిన సినిమా కదా ఇందులో కొత్తగా ఏదీ ఉండకపోవచ్చు అనుకుంటారు కానీ 10 టు 20 పర్సెంట్ సీన్స్ ఎక్కడైనా చూసినట్లు అనిపించినా మిగతా మూవీ మొత్తం న్యూ ఏజ్ కమర్షియల్ దారిలో వెళ్తూ ఆకట్టుకుంటుంది. ‘దిల్ రూబా’లో ఏ దో ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయొద్దనే మేము ముందే ప్రెస్ మీట్స్‌లో కథ రివీల్ చేశాం. లవ్‌లోని మ్యాజిక్ మూవ్ మెంట్స్‌ను ఎంజాయ్ చేస్తారు.
మనం సారీ, థ్యాంక్స్ ఎలా పడితే అలా చె ప్పేస్తుంటాం. కానీ హీరోకు అలా చెప్పడం నచ్చదు. సారీ, థ్యాంక్స్ మాటలకు ఒక విలు వ ఉందనేది అతని వెర్షన్. ఎక్స్ లవర్ ప్రె జెంట్ లవర్స్‌ను కలపడం కొత్తగా ఉంటుం ది. ఇప్పటి దాకా మన సినిమాల్లో ఎక్స్ లవ ర్ వల్ల గొడవలు జరగడం, కామెడీగా చూ పించడం జరిగింది. కానీ ‘దిల్ రూబా’లో ఎక్స్ లవర్‌తో కూడా ఒక స్నేహాన్ని షేర్ చే సుకోవచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వొచ్చనే మంచి పాయింట్‌ను మా మూవీలో చూ స్తారు.
‘దిల్ రూబా’లో సిద్ధు క్యారెక్టరైజేషన్ హైలైట్ గా ఉంటుంది. పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో హీరోలు క్యారెక్టరైజేషన్స్‌లా ఇం దులో హీరో సిద్ధు నమ్మే సిద్దాంతం, అతను చెప్పే మాటలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. హీరో సారీ, థ్యాంక్స్ ఎందుకు చెప్ప డు, అతని ఫ్యామిలీలో జరిగిన ప్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
అన్ని ఎలిమెంట్స్‌తో మూవీ అం తా ప్యాకేజ్‌లా ఉంటుంది. ‘దిల్ రూబా’కు యూత్‌తో పాటు ఫ్యామి లీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతా రు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బందిపెట్టే ఒక్క మాట, ఒక్క సీన్ కూ డా మూవీలో ఉండదు. మేము మూడేళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టాం.
అప్పటికి డ్రాగన్, సం క్రాంతికి వస్తున్నాం సినిమాలు బి గిన్ కాలేదు. మా కంటే ముందు ఆ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ చి త్రాలతో మా దిల్ రూబాకు ఎలాం టి పోలిక ఉండదు. సినిమా నా పేరు మీద థియేటర్స్‌లోకి వస్తుం ది కాబట్టి నేను మూవీ మేకింగ్‌లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అ క్కడి వరకూ అవుతాను. హీరోగా అది నా బాధ్యతగా భావిస్తా.