calender_icon.png 17 April, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏదేదో ఊహించుకోకు..

07-04-2025 12:00:00 AM

నిరుడు ‘తంగలాన్’, ‘యుద్రా’ వంటి సినిమాలతో అలరించింది మాళవికా మోహనన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ చేస్తోంది. ‘సర్దార్2’లోనూ భాగమైంది. అంతేకాక మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘హృదయ పూర్వం’లోనూ ఈ బ్యూటీ నటిస్తోంది. సత్యన్ అంతికాండ్ దర్శకత్వంలో ఆంటోని పెరుంబవుర్ నిర్మిస్తు న్న ఈ సినిమా గత ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అయితే, ఈ మూవీ సెట్స్ ఫొటోలను మాళవిక తాజాగా ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. “సినిమా చేస్తున్నప్పుడు చాలా తక్కువ సార్లు  అంతా ఒకే కుటుంబం అన్న భావన కలుగుతుంది. ‘హృదయపూర్వం’ సెట్‌లో నాకు అలా అనిపించింది.

మోహన్‌లాల్ సర్, సత్యన్ సర్ వంటి గొప్పవాళ్లతో పనిచేయడం నా అదృష్టం” అని వ్యాఖ్యల్ని జోడించింది. ఈ ఫొటోలను ఓ నెటిజన్ వాళ్లను తప్పు పట్టాడు. ’65 ఏళ్ల ముసలాయన.. 30 ఏళ్ల అమ్మాయితో ప్రేమాయణం! ఈ ముసలి హీరోలు వయసుకు సంబంధం లేని పాత్రలను పోషించేందుకు ఎందుకంత ఆసక్తి చూపిస్తారో అర్థం కావడంలేదు’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన మాళవిక ‘సినిమాలో అతను నన్ను ప్రేమిస్తాడని నీకెవరు చెప్పారు? నీకు నువ్వే కథలు అల్లేసుకొని ఏది పడితే అది మాట్లాడకు. నువ్వు ఏదేదో ఊహించుకొని అవతలివారిని నిందించకు’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అయితే, ఈ కామెంట్స్‌ను తర్వాత డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.