calender_icon.png 27 April, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు

27-04-2025 12:51:29 AM

  1. ఆర్థిక, రాజకీయ, సామాజికన్యాయం కోసం కృషి కొనసాగించాలి  

44 అంశాలతో ‘హైదరాబాద్ తీర్మానం’ ఆవిష్కరించిన రాహుల్‌గాంధీ 

ముగిసిన భారత్ సమ్మిట్

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం హెచ్‌ఐసీసీలో రెండురోజులపాటు నిర్వహించిన  భారత్‌సమ్మిట్  విజయవంతంగా ముగి సింది. 100దేశాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రెండోరోజు శనివారం  కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌స భలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ హాజరై ప్రసంగించి.. హైదరాబాద్ తీర్మానాన్ని ఆవిష్కరించారు. ‘గ్లోబల్ జస్టిస్’పై 44అంశా లతో కూడిన హైదరాబాద్ తీర్మానాన్ని భారత్ సమ్మిట్ ఆమోదించింది.

ప్రపంచ న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా 44 కీలక అంశాలను చేర్చారు. ప్రపంచ వ్యా ప్తంగా ప్రగతిశీల, సామాజిక, ప్రజాస్వామ్య, సోషలిస్టు, కార్మిక ఉద్యమాల ప్రతినిధులు కలిసి వచ్చి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయానికి తమ మద్దతు వ్యక్తం చేశారు. 

ఉగ్రవాదం, నిరంకుశ పాలన, ప్రజాస్వామ్య సంస్థలపై దాడులను భారత్ సమ్మిట్ తీవ్రంగా ఖండించింది. ప్రధానంగా గ్లోబల్ సౌత్‌ను ప్రభా వితం చేయడం, పాతుకుపోయిన అసమానతలు, పర్యావరణ క్షీణత, ఆర్థిక అన్యాయా లను పరిష్కరించాల్సిన తక్షణ అవసరంపై స్పందించాలన్నారు. 

‘డిఫెండ్ డెమోక్రసీ, సోషల్ జస్టిస్’తో ప్రజాస్వామ్య సంస్థలను రక్షించాలని, మానవ హక్కుల ఉల్లంఘనలకు జవాబుదారీతనం కోరడంతో సమగ్ర డిజిటల్ పాలన సంస్కరణలకు పిలుపునిచ్చింది. మానవ హక్కులను సమర్థించడం, దౌత్యాన్ని ప్రోత్సహించడం, సత్యం, సయో ధ్య ప్రక్రియలకు మద్దతు ఇవ్వడం ద్వారా మానవ భద్రత కోసం పనిచేయాలన్నారు.