24-02-2025 12:52:02 AM
కోదాడ ఫిబ్రవరి 23: కాలేయ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మట్టా రాకేష్ తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణం లోని హుజూర్నగర్ రోడ్డులో గల కేర్ డయాగ్న స్టిక్ అండ్ స్కాన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత లివర్ క్యాంపు కార్యక్ర మంలో వారు పాల్గొని రోగులకు ఉచితంగా ఓపి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి మందులను అందించారు.
ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి పైగా రోగులకు వైద్య సేవలను అందిం చారు. ఉచితంగా ఓపి 5000 రూపాయల విలువ చేసే ఫైబ్రో స్కాన్, రక్త పరీక్షలు జరిపి రోగులకు సేవలు అందించినందుకు గాను డాక్టర్ మట్టా రాకేష్ కేర్ డయాగ్నస్టిక్ నిర్వాహకులను పలువురు అభినందించారు.