calender_icon.png 5 March, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినికిడి లోపాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

03-03-2025 12:31:29 AM

  1. మెడికవర్ హాస్పిటల్ వైద్యుడు మొగంటి అశోక్ పృథ్వీరాజ్
  2. నేడు ప్రపంచ వినికిడి దినోత్సవం

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): శబ్దంతో కలిగే వినికిడి లోపాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఈఎన్‌టీ, తల, మెడ శస్త్రచికిత్స నిపుణుడు, డాక్టర్ మొగంటి అశోక్ పృథ్వీరాజ్ సూచించారు. మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆయన పలు సూచనలు చేశారు.

హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో పెరుగుతున్న శబ్దకాలుష్యం వల్ల, నిరంతరం హెడ్‌ఫోన్స్ వినడం, పారిశ్రామిక వాడల్లో శబ్దాలు, నగర జీవనశైలిలో ఎదురయ్యే రణగొణ ధ్వనుల వల్ల వినికిడి సమస్యలు పెరుగుతున్నాయన్నారు. చాలా మంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇలా చేస్తే చివరకు రోజువారీ సంభాషణలు సైతం వినలేని పరిస్థితికి చేరుకుంటారన్నారు.

చెవిలో మోత, మాటలు వినిపించకపోవడం, శబ్దవాతావరణంలో అసౌకర్యం వంటి లక్షణాలు కనపడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో శబ్దంతో కలిగే వినికిడి లోపం(నాయిస్ ఇండ్యూస్‌డ్ హియరింగ్ లాస్ సమస్యకు చికిత్స లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వినికిడి లోపం తలెత్తకుండా చెవులను రక్షించుకుంటామని ప్రతీ ఒక్కరూ ప్రతిజ్ఞ చేయా లని పిలుపునిచ్చారు.