calender_icon.png 19 April, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు

08-04-2025 12:46:18 AM

ప్రముఖ డాక్టర్ నవ్య తేజ

ముషీరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): నిరోధమే ఉత్తమ చికిత్స అని అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రముఖ  డాక్టర్ నవ్య తేజ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్‌లోని అంబి దవాఖాన లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఆరో గ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం డాక్టర్ నవ్య తేజ మాట్లాడుతూ జీవనశైలి వల్ల కలిగే వ్యాధులు మధుమేహం, హైపర్ టెన్షన్, ఉబకాయం తదితర రోగాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు రావాలని, ప్రతి రోజు వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన ఎండి సందీప్, షేక్ హర్పియా పాల్గొన్నారు.