calender_icon.png 11 April, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు

26-03-2025 12:41:49 AM

ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్

ముషీరాబాద్, మార్చి 25: (విజయక్రాంతి): విద్యార్థులకు సూచించారు. ప్రాథమిక దశ లోనే ఇబ్బందులను గుర్తించి డాక్టర్లను సంప్రదించి వైద్య పరీక్షలు పొం దడం వల్ల కంటి సమస్యలు పరిష్కరించవచ్చని అన్నారు. ఈ మేరకు  మంగళవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం లో ఆర్బీ ఎస్కె సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ మాట్లాడుతూ ఈరోజుల్లో కంటిచూపు సమస్య తీవ్రమైందని అన్నారు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.

ఆహారపు అలవాట్లలో మార్పు ఎక్కువగా ఏ విటమిన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఫోన్, టీవీలు ఎక్కువ సమ యం చూడవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ విద్య మండలి డిప్యూ టీ ఐఓఎస్ స్వరూప రాణి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రతన్, ఇస్మాయిల్, ఆర్బి ఎస్కే సంస్థ డాక్టర్లు లారా, శ్రీదేవి, ముషీరాబాద్ యూపీహెచ్సీ వైద్య సిబ్బంది ఫిల్లిస్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.