13-03-2025 07:46:29 AM
ముషీరాబాద్ యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి..
ముషీరాబాద్,:(విజయక్రాంతి): మధుమేహం, రక్తపోటు, నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యం పొందాలని ముషీరాబాద్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యుపిహెచ్ సి) వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం బాకారంలో సాంక్రమీ కేతర జబ్బులు ( ఎన్ సి డి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) నియంత్రణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వైద్య శిబిరాన్ని డాక్టర్ మనోజ్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. గుండె జబ్బులు, స్ట్రోక్ క్యాన్సర్,దీర్ఘకాలిక శ్వాసకోస వ్యాధులు, అంటువ్యాధులు కాదని, అయినప్పటికీని మరణాలకు ప్రధాన కారణాలు అన్నారు.
రోజురోజుకు ఈ వ్యాధుల సంఖ్య పెరిగిపోతున్నదని అన్నారు. ఈ వ్యాధులకు ప్రధాన కారణం హానికరమైన మద్యం,పొగాకు, అనారోగ్యకరమైన ఆహారం, తగిన శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, ఉపకాయం, రక్తం లో చక్కెర, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వస్తాయన్నారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నదని, ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు లాంటి జబ్బులు 30 నుంచి 40 ఏళ్ల వయసులోని వారిలో సర్వసాధారణం అయిపోయాయని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఏఎన్ఎంలు పద్మ,లత ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.