- ప్రజాపాలనా దినోత్సవంపై సీఎస్ ఆదేశం
- కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఈనెల 17న జరు గనున్న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలకు ఎలాంటి లో టు పాట్లు లేకుండా ఘనంగా ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఆదివారం జీఏ డీ కార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తె లంగాణ ప్రజా పాలనా దినోత్సవ ప్రధాన వేడుకలు నిర్వహించే పబ్లిక్ గార్డెన్స్, అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తం గా వేడుకలు నిర్వహిస్తున్నందున ఎక్కడ కూడా లోటుపాట్లు తలెత్తవద్దని, ఆ విధంగా ఏర్పాట్లు చేసు కోవాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. ఈ వేడుకలకు ప్రజాప్రతి నిధులు, అన్ని కార్పొరేషన్ల చైర్మన్లకు ఆహ్వానం అందేలా కలెక్టర్లు జాగ్రత్త వహించాలన్నారు. ఉదయం 10 గంటలకు జెండా వందనం జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పలువురు ప్రముఖులు హైదరాబాద్‌లో జరిగే ప్రధాన వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున కలెక్టర్లు వారి వారి జిల్లాల్లో ఉన్న ప్రముఖులు ఎక్కడ హాజరవుతున్నారనే సమాచారం తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.