- యూనివర్సిటీలపై పెత్తనమంటే రాష్ట్రాలపై దాడే
- యూజీసీ నిబంధనల మార్పు అంగీకరించం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): యూజీసీ నిబంధనలు మార్చి రాష్ట్రాల పరిధి నుంచి యూనివర్సిటీలపై అధికారాలను తప్పించాలని కేంద్రం చూస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన వెనక పెద్ద కుట్ర దాగిఉందని..
యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళ్తే కొంతమంది చేసే విషప్రచారానికి యూనివర్సి టీలు వేదికలు కాబోతున్నాయని చెప్పారు. డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్ర మంలో సీఎం హాజరై మాట్లాడారు.. “ప్రధాని మోదీకి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా..
మీరు యూజీసీ నిబంధనలు మార్చాలనుకోవడం రాజ్యాంగంపై, రాష్ట్రాలపై సాం స్కృతిక దాడి చేయడమే.. ఇలాంటి చర్య లు కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదు.. అనవసర వివాదాలకు దారితీస్తుంది.. దీన్ని రాష్ట్రాలపై దాడిగానే భావిస్తున్నాం..” అని చెప్పారు. తమ హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.
యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. అలా చేయకపోతే అవసరమైతే నిరసనలకు వెనకాడ బోమన్నారు. రాష్ట్రాల అధికారాలను ఒక్కొక్కటిగా కేంద్రం తీసుకుంటూ వెళ్తే.. రాష్ట్రాలు కేవలం పన్నుల వసూలు చేసే సంస్థలుగా మిగలాల్సి వస్తుందని తెలిపారు. పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని...
గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణమన్నారు. పద్మ అవార్డులపై ఈ వేదికగా తమ అసంతృప్తిని కేంద్రానికి తెలియజేస్తున్నామని.. త్వరలోనే ప్రధానికి ఈ విషయమై లేఖ రాయబోతున్నట్లు సీఎం పేర్కొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ చర్చ దురదృష్టకరం..
దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టకరమని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం సర్టిఫికెట్ల కోసం మాత్రమే కాదని.. సామాజిక బాధ్యతగా ఆనాడు పీవీ నరసింహారావు యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లారన్నారు.
విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదన్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యావ్యవస్థను గాడినపెట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలను నియమించామని తెలిపారు.
వందేళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించామని, యూనివర్సిటీల్లో టీచి ంగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశిం చామన్నారు. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేస్తే అది మంచిది కాదన్నారు.
రాష్ర్టంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలన్నారు. దేశానికి పీవీ నర్సింహరావు, జైపాల్ రెడ్డి లాంటి వారిని అందించిన ఘనత యూనివర్సిటీలదేనన్నారు. చిట్టచివరి పేదల వరకు సంక్షేమ ఫలాలు అందాలన్న అంబేద్కర్ ఆశయంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.