calender_icon.png 9 October, 2024 | 8:51 PM

చేతులూపితే కష్టం తీరుద్దా?

04-09-2024 01:01:50 AM

బాధితులకు తిండి, నీళ్లు కూడా ఇస్తలేరు

క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే నష్టం అంచనాలా? 

  1. అవసరమైతే వరద ప్రాంతాల్లో ప్రధాని పర్యటన 
  2. రాష్ట్రం వద్ద రూ.1,345 కోట్ల ప్రకృతి విపత్తు నిధి 
  3. ఇకపై ఏటా హైదరాబాద్ విమోచన దినోత్సవం 
  4. కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే పంట నష్టం అంచనా వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రకృతి విపతుల సమయంలో వాడుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.౧౩౪౫ కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులను ఉంచిందని, వాటిని రేవంత్ సర్కారు ఎందుకు వాడటం లేదని ప్రశ్నించారు.

మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద బాధితులను పరామర్శించేందుకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు వెళ్లటం లేదన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ‘బాధితులకు ఆహారం, నీళ్ల వంటి నిత్యావసరాలు అందించటంలో ఇబ్బందులు ఎదురుకావొద్దన్న కారణంతోనే వెంటనే మేము వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు. ఈ అత్యవసర ఆపత్కాలంలో మేము వెళ్తే అధి కారులు సహాయక చర్యలను పక్కనబెట్టి మా వెంట వస్తారు.

అది బాధితులకు మరింత ఇబ్బందులు కలిగిస్తుంది. బాధితులకు ప్రస్తుతం తాగునీరు, ఆహారం, చిన్నారులకు పాలు అందించడం ముఖ్యం. కేరళలోని వయనాడ్ దుర్ఘటన విషయంలోనూ ప్రధాని మోదీ ఆలస్యంగా పరామర్శకు వెళ్లటానికి ఇదే కారణం’ అని వివరించారు. తెలంగాణలో పరిస్థితిని బట్టి  అవసరమైతే ప్రధాని పర్యటిస్తారని వెల్లడించారు. 

ఇదేం నష్ట అంచనా?

అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే వరద నష్టం అంచనా వేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. బాధితులకు కనీసం మంచినీరు, ఆహారం, చిన్నారులకు పాలు కూడ అందించలేదని ఆరోపించారు. సాయం అందించకుండానే మనం చేతులు ఊపితే ఎలా? అని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చురకలంటించారు. ఈ విపత్కర సమయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు వచ్చి సమీక్షిస్తాయని తెలిపారు. ప్రధానంగా పదకొండు జిల్లాల్లో వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దురదృష్టవశాత్తు కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారని కేంద్రమంత్రి విచారం వ్యక్తంచేశారు.

వర్షాలు, వరదల వల్ల ఆస్తులు, పంట నష్టం భారీగా వాటిల్లిందని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే వరద ప్రభావంపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడారని గుర్తుచేశారు. పరి స్థితులను ఎప్పటికప్పుడు కేంద్రం సమీక్షిస్తున్నదని, ఇప్పటికే దెబ్బతిన్న రైల్వే లైన్లు, జాతీ య రహదారులను మరమ్మత్తు చేయాలని ప్రధాని కార్యాలయం ఆదేశించిందని తెలిపారు. బీజేపీ శ్రేణులు వరద ప్రభావిత ప్రాం తాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకొన్నాయని చెప్పారు. మంగళవారం బీజేపీ సభ్య త్వ నమోదు ప్రారంభిచాల్సి ఉన్నా వర్షాల వల్ల వాయిదా వేసినట్టు తెలిపారు.

రాష్ట్రం వద్ద కేంద్ర విపత్తు నిధులు

ఎన్డీఆర్‌ఎఫ్‌లో తెలంగాణ ప్రభుత్వం వద్ద కేంద్రం నిధులు రూ.1,345 కోట్లు ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అత్యవసరంగా ఆ నిధులను ఉపయోగించి బాధితులను ఆదుకోవాలని సూచించారు. ఆ నిధులు అయిపోయాక తాత్కాలికంగా కేంద్రం నుంచి విడుదల చేస్తామని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోపాటు నేటి కాం గ్రెస్ ప్రభుత్వం గతంలో కేంద్రం విడుదల చేసిన ఎస్డీఆర్‌ఎఫ్‌కు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ కేంద్రానికి సమర్పించలేద ని ఆరోపించారు. తాజాగా వర్షాలతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నందున రాష్ర్ట ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వకున్నా తాత్కాలికంగా వరద బాధిత ప్రాంతా లకు తక్షణమే సాయం అందించాలని కేంద్ర హోం సెక్రటరీని కోరామని వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 1న కేంద్రం రూ.208 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. 

రూ. 5 లక్షల్లో రూ.3 లక్షలు మావేనా?

మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నదని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ర్ట సర్కార్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ప్రకటించటం పట్ల సందేహం వెలిబుచ్చారు. కేంద్రం ఇచ్చే సాయాన్ని కలుపుకుని సీఎం రూ.5 లక్షలు ప్రకటించారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. వరద వల్ల పశుసంపదకు నష్టం వాటిల్లితే ఆవులు, గొర్రెలకు కూడా కేంద్రం పరిహారం అందిస్తుం దని వెల్లడించారు. అంటువ్యాధులు ప్రబలకుండా రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవా లని కోరారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాలను జాతీయ విపత్తు కింద ఎక్కడా ప్రకటించడం లేదని చెప్పారు. నిధులు ఇచ్చి సహాయ, సహకారాలు అందిస్తున్నప్పుడు జాతీయ విపత్తుగా ప్రకటించడం ఎందుకని ప్రశ్నించారు.

ఇకపై ఏటా విమోచన దినోత్సవం 

హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం జరిగేలా కేంద్రం నిర్ణయిం తీసుకుందని కిషన్‌రెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 17న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు వివరించారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ర్ట ప్రభుత్వాలు హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో అధికారిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ర్టంలో మజ్లిస్ పార్టీకి భయపడి గతంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించలేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి పాఠశాలపైన జాతీయ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. 

కేంద్రం సాయం ఇలా అందిస్తాం..

వరద బాధితుల్లో క్షతగాత్రులకు 60శాతం పైబడిన వైకల్యానికి రూ. 2.5 లక్షలు, బాధితులు వారంకంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉంటే రూ.16 వేలు, వారంకన్నా తక్కువ రోజులుంటే రూ.5,400 చొప్పున కేంద్రం సాయం అందిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. వరదల కారణంగా వస్తువులు, దుస్తులు నష్టపోయినవారికి రూ.2,500, వంటపాత్రలు నష్టపోయిన వారికి రూ.2,500, పాడి పశువులను కోల్పోయిన రైతులకు గేదె, ఆవులకు అయితే ఒక్కో దానికి రూ. 37,500.. గొర్రెలు, మేకలకు ఒక్కోదానికి రూ.4 వేలు, ఒక్కో ఎద్దుకు రూ.32 వేల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుందని వివరించారు. వరదల కారణంగా జీవనో పాధి కోల్పోయిన వారికి ఉపాధిహామీ పథకం ప్రకారం రోజుకు ఇవ్వా ల్సిన కూలీ అందిస్తామని తెలిపారు.

బాధితులను లెక్కించాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిదేనని స్పష్టం చేశా రు. వరదల కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారికి 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు సహాయం అందిస్తామని తెలిపా రు. పంటపొలాల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు హెక్టారుకు రూ.18 వేలు, ఒక రైతుకు కనీసం రూ.2,200 చొప్పున సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. పంటలకు వర్షాధార ప్రాంతాల్లో హెక్టారు కు రూ.8,500, నీటిపారుదల ఉన్న పంటలకు హెక్టారుకు రూ.17 వేలు, పామాయిల్, కొబ్బరి వంటి శాశ్వత పంటలకు హెక్టారుకు రూ.22,500 అందిస్తామని తెలిపారు. రాష్ర్ట ప్రభు త్వం కూడా వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రం నుంచి అందించే ఆర్థిక సాయాన్ని బాధితులకు అందజేయాలని కోరుతున్నా మని కిషన్‌రెడ్డి తెలిపారు.