- యూజీసీ కొత్త నిబంధనలతో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
- ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు అన్యాయం చేయొద్దు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): రాష్ట్ర వర్సిటీల్లో సెర్చ్ కమిటీల బా ధ్యతను గవర్నర్‌కు అప్పగించేలా యూజీసీ కొత్త నిబంధనలు ఉన్నాయని, దీంతో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
యూజీసీ నూతన మార్గదర్శకా లపై కేంద్రం తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందిగా ఉం టుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి తమ అభిప్రాయాలు నివేదించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్రమంత్రులు ధర్మేంద్రప్రధాన్, నితిన్‌గడ్కరీని బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పలు అంశాలపై వినతులు ఇచ్చారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నూతన నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. గవర్నర్ ద్వారా వర్సిటీలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటోందని విమర్శిం చారు. యూజీసీ నిబంధనల అభ్యంతరాలపై 6 పేజీలతో నివేదిక ఇచ్చామని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని విన్నవించామన్నారు.
‘దేశంలో రాష్ట్రాల హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ర్ట పరిధిలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్ నియామకానికి వేసే సెర్చ్ కమిటీల బాధ్యతను పూర్తిగా గవర్నర్‌కు అప్పగించడం సరి కాదన్నారు. ఈ అంశంపై పార్టీ తరఫున విద్యారంగ మేధావులతో ఒక సమావేశం ని ర్వహించిన తర్వాత తమ పార్టీ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు.
“నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్” అనే నిబంధనను తీసుకురావడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారం కాకుండా అభ్యర్థులు దొరకలేదనే సాకుతో ఆ ఉద్యోగాలు ఇతర కేటగిరీలతో భర్తీ చేసే ప్రమాదముందని, ఇది రాజ్యాంగం ఆయా సామాజికవర్గాలకు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన హక్కును హరించడమే అవుతుందని కేటీఆర్ తెలిపారు.
మరో వైపు ఎన్‌హెచ్ రహదారిని పొడిగించాలని కేంద్రమంత్రి నితీన్ గడ్కరీని కోరినట్లు చెప్పారు. మిడ్ మానేరు మీదుగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిను ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరుట్లలో జాతీయ రహదారిని 63 కలిపేలా విస్తరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన పార్టీ తరఫున వేసిన కేసును కూడా ఫాలోఅప్ చేస్తామన్నారు. కచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటుపడేలా కోర్టులో కొట్లాడుతామన్నారు.