calender_icon.png 30 September, 2024 | 5:54 AM

సర్వే బాధ్యతలు ఏఈవోలకు ఇవ్వొద్దు

29-09-2024 02:09:02 AM

టీఎన్జీవో అధ్యక్షుడు జగదీశ్వర్

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): డిజిటల్ క్రాప్ సర్వే పేరు తో వ్యవసాయశాఖలోని విస్తరణాధికారు(ఏఈవో)లను భయభ్రాంతుల కు గురిచేస్తున్నారని తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల సెంట్రల్ ఫోరం ఆరోపించింది. యాప్‌ను సెల్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకొని సర్వే చేప ట్టాలని, లేకుంటే విధినిర్వహణలో ఉన్నా సెలవుగా ప్రకటిస్తామని అధికారులు భయపెడుతున్నారని తెలిపింది.

నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో శనివారం  ఏఈవో అధికారుల సెంట్రల్ ఫోరం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ హుస్సేనీ పాల్గొని మాట్లాడా రు. పంట సర్వే మొత్తం బాధ్యతలను ఏఈవోల నెత్తినపెట్టడం సరికాదని, సర్వేను పూర్తి చేయాలంటే 455 రోజు లు సమయం పడుతుందని తెలిపా రు.

మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో యువకులు, పిక్ పహానీ వెయ్యి ఎకరాల పరిమితితో సర్వే చేయిస్తున్నారని వివరించారు. రైతు వేదికల్లో నిర్వహించిన రైతు సమావేశాలు, శిక్షణకు రూ. 9 వేలు కేటాయించాల్సి ఉండగా, కేవ లం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారని, ఆ నిధులను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఏఈవో రాష్ట్ర అధ్యక్షుడు డీ శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి కే సురేశ్‌రెడ్డి, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.