ట్రెజరిస్, అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ లో నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్స్ ఇవ్వొద్దని, ఇప్పటికే ఇచ్చిన వాటి ని నిలిపేయాలని తెలంగాణ ట్రెజరిస్ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
అసో సియేషన్ సభ్యులు బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి సందీప్‌కుమార్ సుల్తానీయాను కలిసి వినతిపత్రం అందజేశారు. అర్హతలేని వారికి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పదవి ఇచ్చారని.. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని సుల్తానీయా ను కోరారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో అసోసియేషన్ ఫౌండర్ ప్రెసి డెంట్ జీ వెంక ట్ రెడ్డి, అధ్యక్షుడు జీ పురుషోత్తమ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వై పరశురాం, కోశాధికారి ఎం జగన్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు సీహెచ్ శిరీష, ఎస్‌కే సైదులు, సాయిరెడ్డి, ఎం సత్యనారాయణ, ఎం కృష్ణయ్య, వై శ్రీనివా స్ రెడ్డి, ఎం లావణ్య పాల్గొన్నారు.