- వివేకా కేసులో సీబీఐ వాదన
- తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మూడో నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదించింది.
వివేకా హత్య ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని, హత్య పథక రచనలోనూ కీలక పాత్ర పోషించారని, జైలులో ఉన్నాడన్న కారణంగా నిందితులకు బెయిల్ మంజూరు చేయరాదని, బెయిల్ మంజూరుకు తగిన కారణాలు కూడా లేవని పేర్కొంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఉమాశంకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను మంగళవారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.