calender_icon.png 17 March, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధాప్యం బారినపడకుండా!

16-03-2025 12:00:00 AM

వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు పడటం శక్తి తగ్గిపోవడం.. సహజం. వీటన్నింటికన్నా మరణానికి దగ్గరవుతున్నామన్న భయమూ మొదలవుతుంది. అందుకే వృద్ధాప్యం రాకుండా ఆయుష్షును పెంచేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఎలుకలూ, కోతుల్లో చేసిన ఓ పరిశీలనలో వృద్ధాప్యాన్ని రానివ్వని టారిన్ అనే అమైనో ఆమ్లాన్ని గుర్తించారు.

ఆస్ట్రేలియాలోని హ్యారీ పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన పరిశీలకులు. వయసు పెరిగేకొద్దీ డీఎన్‌ఏలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా కణవిభజన సరిగ్గా ఉండదు. దాంతో కణాలు పోషకాల్ని గ్రహించలేవు, శక్తిని అందించలేవు. మొత్తంగా శరీర వ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది.

దీనికి కారణం రక్తంలో టారిన్ అనే ప్రొటీన్ శాతం తగ్గిపోవడమేననీ, కణాల పెరుగుదలకి ఇది ఎంతో కీలకమనీ తెలుసుకున్నారు. దాంతో ఈ అమైనో ఆమ్లం ఎక్కువగా ఉండే షెల్‌ఫిష్, మాంసాహారాన్ని తీసుకున్న ఎలుకలూ, కోతులూ ఎక్కువకాలం జీవించడంతోపాటు వాటిల్లో రోగనిరోధకశక్తి పెరిగి అవయవాల పనితీరు కూడా మెరుగైనట్లు కనుగొన్నారు. సో.. త్వరలోనే మనుషుల్లోనూ టారిన్ సప్లిమెంట్ల ద్వారా ఆయుష్షును పెంచే ఆలోచన చేస్తున్నారు పరిశోధకులు.