calender_icon.png 6 November, 2024 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యసనాల బారిన పడొద్దు

05-11-2024 01:40:03 AM

వసతిగృహ విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 4 (విజయ క్రాంతి): గంజాయి, డ్రగ్స్ వంటివి అన్నింటి కంటే పెద్ద ప్రమాదకరమని, యువతరం అలాంటి వ్యసనాల బారిన పడొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచి న నేపథ్యంలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మంచి ర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ ఆధ్వర్యంలో విద్యార్థులంతా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చారు. ప్రభుత్వ వసతిగృహాల విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచడంతో విద్యార్థులు థాంక్యూ సీఎం సార్ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమ స్యలను తెలుసుకున్నారు.

స్థానిక అధికారుల తో స్థల సేకరణ చేయించిన అనంతరం సొంత హాస్టల్ భవనం మంజూరు చేస్తామ ని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ  ప్రజా ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పా టు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని వెల్లడించారు. త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు. స్కూల్స్, కాలేజీ ల్లో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించాలని సూచించారు. యువత విద్యను నిర్లక్ష్యం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు  పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమేనని చెప్పారు. చదువుకున్న వారు ప్రయోజనకులవుతారని, సామాజిక స్పృహతో సమాజానికి సేవ చేసే వారు హీరోలవుతారని స్పష్టం చేశారు.  విద్యార్థులంతా ఉన్నతంగా చదువుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.