calender_icon.png 17 March, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక అలా టాటూ వేయించుకోవద్దంటూ..

17-03-2025 12:46:43 AM

సమంత తెలుగులో చివరిసారి విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’లో నటించింది. తర్వాత ఓటీటీ వేదికగా ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌లో మెరిసింది. కథానాయికగా ఒకప్పుడు తెలుగునాట సత్తా చాటిన ఆమె చాలా కా లంగా నటనకు దూరంగా ఉన్నారు. చాలా రోజుల క్రితమే ‘ట్రాలాలా మూ వీంగ్ పిక్చర్స్’ పేరుతో సొంతంగా ఓ ప్రొడక్షన్‌ను స్థాపించిన సమంత తాజా ఈ బ్యానర్‌లో రూపొందించిన తొలి సినిమాను సైతం ప్రకటించింది.

‘శుభం’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా గురించి ప్రకటన చేస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలతోపాటు ఓ పర్సనల్ ఫొటోను సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది సమంత. మిగతా ఫొటోల కన్నా ఆ ప్రత్యేకమైన ఫొటోపై ప్రస్తుతం నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ ఫొటో గురించే అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటో కథాకమామిషూ ఏంటంటే.. అందులో సమంత చేతికి ఉన్న టాటూ అస్పష్టంగా కనిపిస్తోంది.

సమంత ఆ టాటూను తన మాజీ భర్త, టాలీవుడ్ హీరో నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు వేయించుకున్న టాటూ అది. ప్రస్తుతం ఆ టాటూను తొలగించుకున్నప్పటికీ కొద్దికొద్దిగా కనిపిస్తోంది. ఈ టాటూ గురించే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘మొత్తానికి నాగచైతన్య గుర్తుగా ఉన్న టాటూను తొలగించుకున్నారు’, ‘ఇప్పట్నుంచీ మీ సొంత రియాలిటీని సృష్టించండి’, ‘టాటూను తొలగించుకోవటం మంచిదే.. ఇకపై మీ భాగస్వామి పేరును ఎప్పుడూ టాటూగా వేయించుకోకండి’ అంటూ రాసుకొచ్చారు సమంత అభిమానులు.