29-03-2025 02:18:50 AM
నిమ్స్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ సేవలు పూర్తి ఉచితం
గుండెలో రంధ్రమున్న చిన్నారి రోగులకు సర్జరీతో పునర్జన్మ
ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిన ఆస్పత్రి
తెలంగాణ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ ద్వారా నయాపైసా లేకుండా
పొరుగురాష్ట్రాలవారు సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీలు తెచ్చుకుంటే సరి
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన ఓ జంటకు లేకలేక సంతానం కలిగింది.. అయితే చిన్నారికి పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది. స ర్జరీ చేయకుంటే బతికే ఛాన్స్ లేదని వైద్యు లు స్పష్టం చేశారు. చికిత్సకు రూ.10లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. అంత ఖర్చుపెట్టినా బతికే పరిస్థితి లేదు.. ఈ స్థితిలో నిమ్స్‌లో పీడియా ట్రిక్ కా ర్డియాక్ సేవలు ఉచితంగా ఇస్తారనే విష యం తెలుసుకున్న ఆ దంపతులు రెండు రో జుల ఆ చిన్నారిని చికిత్సకు తీసుకొచ్చారు.
నిమ్స్ వైద్యులు ఆ పసికందుకు తిరిగి ప్రాణం పోశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసే ఈ వైద్యం గురించి చాలా మందికి తెలియకపోవడంతో వారు ఖరీదైన వైద్యం అనే ఉద్దేశంతో చిన్నారుల గుండెలకు రంధ్రాలు పడి నా కూడా అలాగే వారి జీవితాన్ని ముందు కు లాగుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలకు ఈ కష్టం వస్తే నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందుతుందనే విషయం తెలిసేలా చూడాలని పీడియాట్రిక్ కార్డియాక్ విభాగం వైద్యులు కోరుతున్నారు. ప్రతీ నెల సగటున 30కి పైగా క్లిష్టమైన సర్జరీలు చేస్తున్నారు. ఈ విభాగంలో ఓపీ సేవల కోసం వస్తున్న రోగుల్లో 80 శాతం మంది చిన్నపిల్లలే.
పైసా ఖర్చు లేదు..
పుట్టుకతో వచ్చే హృద్రోగ సంబంధమైన రోగాలకు పైసా ఖర్చు లేకుండా చికిత్స చేస్తామని నిమ్స్ కార్డియో థొరాసిక్ విభాగాధి పతి డా. అమరేశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న వారందరికీ ఈ వైద్య సేవలు ఉచితంగానే అందుతాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు స్థానికంగా సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీలు తెచ్చుకుంటే వారికి కూడా ఉచితంగానే వైద్యసేవలు లభిస్తాయి.
అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా గుండె సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయని ఇలాంటి కేసుల్లో పసికందు తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, లేదా రోగి జనన ధ్రువీకరణ పత్రం ఉన్నా వైద్యం అందిస్తారు. పీడియాట్రిక్ కార్డియాక్ హెచ్‌వోడీ డా.అమరేశ్‌రావు, వైద్యులు డా.ప్రవీణ్, డా.గోపాల్ బృందం నెలనెలా సుమారు 30 నుంచి 35 కేసుల్లో సర్జరీలు చేసి ప్రాణాలు కాపాడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిమ్స్ పాత భవనం, మొదటి అంతస్తులో వార్డ్ -6లో డా.అమరేశ్‌రావును సంప్ర దిస్తే వైద్యసేవలు అందిస్తుండటం విశేషం.
పసికందు నుంచి యువకుల వరకు.. పీడియాట్రిక్ కార్డియాక్ విభాగం, నిమ్స్
అప్పుడే పుట్టినబిడ్డకు కూడా గుండెలోపాలు ఉంటున్నాయి. జన్యుపరమైన సమ స్యల కారణంగా ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా పుట్టిన పసికందులకు గంటల్లోనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడాల్సి ఉంటుంది. చాలామంది ఇది ఎంతో ఖరీదైన వైద్యం అనే భావనతో ఆస్పత్రికి రావడానికి సందేహిస్తుంటారు. కానీ తెలంగాణలోని వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఈ వైద్యం పూర్తిగా ఉచితంగా అందిస్తాం. పుట్టినప్పటి నుంచే గుండె సమస్యలున్న సుమారు 30 ఏళ్ల యువకులకు ఇటీవల సర్జరీలు చేసి ప్రాణాలు నిలబెట్టాం.
క్రిటికల్ కేసులే ఎక్కువ.. థొరాసిక్ విభాగాధిపతి డా.అమరేశ్‌రావు
నిమ్స్‌కు వచ్చే పీడియాట్రిక్ కార్డియాక్ కేసుల్లో అత్యంత క్లిష్టమైన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. వీరిలో కా ర్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వస్తున్న రోగులు కూడా ఎక్కువే. ప్రతీనెలా 30కి పైగా మంది చిన్నారులకు గుం డె ఆపరేషన్లు విజయవంతంగా చేస్తు న్నాం. ఎక్కువగా పుట్టుకతోనే గుండె లో రంధ్రాలు ఉండటం, గుండె సరి గ్గా కొట్టుకోకపోవడం, గుండెకు సంబంధించిన కనెక్షన్స్ సరిగ్గా లేకపోవడం, తారుమారుగా ఉండటం వంటి సమస్యలతో చిన్నారులను ఇక్కడకు తీసుకొస్తున్నారు.