calender_icon.png 13 January, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూలాలను మరువద్దు

13-01-2025 02:28:22 AM

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

చేవెళ్ల, జనవరి 12: చీమలకు చక్కెర పెట్టి.. పశువులకు దండం పెట్టే సంస్కృతి మనదని, అలాంటి సంస్కృతిని మరిచిపోవద్దని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఎప్పుడూ మన మూలాలను మరువద్దని, అందులో గొప్ప సంస్కృతి, గొప్ప సామాజిక, ధార్మిక విలువలున్నాయని స్పష్టం చేశారు. ఆదివారం మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ‘ద వెన్యూ ఫంక్షన్‌హాల్’ లో సర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా శ్రీ తమ్మేటి రఘోత్తమ్ రెడ్డి, మరికొందరి రచనలతో రైతునేస్తం వారు ప్రచురించిన ‘వండని వంటలు’ రఘోత్తమ్ రెడ్డి గారి ‘మిద్దెతోట’ పుస్తకానికి హిందీ అనువాదమైన ‘బాగ్ వని’ పుస్తకాలను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, ఏపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, వైఎస్ చౌదరి, డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి, హస్యనటుడు బ్రహ్మానందం, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, దవెన్యూ పంక్షన్ హాల్ యజమాని తుమ్మల సంపత్, స్థానిక నాయకులు మల్కారి వైభవ్‌రెడ్డి, గుండన్నగారి వెంకట్ రెడ్డి, మామిడి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.