calender_icon.png 27 December, 2024 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, బీఆర్‌ఎస్ ట్రాప్‌లో పడొద్దు

31-10-2024 12:53:45 AM

ప్రజలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పిలుపు

కరీంనగర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్, బీజేపీ ట్రాప్‌లో పడవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఈ రెండు పార్టీలు చీకటి దొంగలని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

బుధవారం కరీంనగర్‌లోని బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితి నెల కొందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, రేషన్‌కార్డులు, పింఛన్లు, రైతు భరోసాపై దృష్టి సారించాలని సూచించారు.

డిసెంబర్ 26కు సీపీఐ వందేళ్లలోకి అడుగిడుతున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.  సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.