calender_icon.png 24 November, 2024 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమాయకుల జోలికి రావొద్దు!

13-11-2024 12:00:00 AM

మాజీ స్పీకర్ మధుసూదనాచారి

వికారాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): లగచర్ల ఘటనలో పోలీసులు అమాయకులను ఇబ్బంది పెడితే సహించబోమని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు నరేందర్‌రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, మహేశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ప్రభుత్వ అధికారులపై భౌతిక ఘటన వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు లగచర్లకు బయల్దేరారు.

వారిని మన్నె గూడ చెక్ పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. గ్రామ స్తులతో మాట్లాడేందుకు వెళ్తున్న తమ ను అరెస్టు చేయడం దారుణమన్నారు. రైతులు ఫార్మాసిటీకి భూము లు ఇచ్చేందుకు సిద్ధంగా లేరన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేయడం సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నేత సురేశ్ తనతో ప్రతిరోజు మాట్లాడతాడని, కార్యకర్తగా పార్టీ విషయాలు తనతో చర్చిస్తానని స్పష్టం చేశారు.