09-03-2025 07:58:47 PM
చెరువులను త్వరగతిన నింపండి..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి కాల్వల ద్వారా వచ్చే నీటి ప్రవాహాన్ని పెంచి వీలైనంత త్వరలో గ్రామాలలో త్రాగు సాగునీరుకి ఇబ్బందులు లేకుండా చూసి చెరువులను తరగతిగా నింపాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రత్తిపల్లి, బీరెల్లిగూడెం, పులిపల్పుల చెరువులను నింపడానికి తన నిధులుతో కాలువ తవ్వించి కృష్ణా జలాలతో చెరువులను నింపుతున్నారు. సాగునీరు అందించే పులిపలుపుల చెరువులోకి కృష్ణా జలాలు చేరడంతో కృష్ణా జలాలకు ప్రజలతో కలిసి పూజలు చేశారు.
భూగర్భ జలాలు కనిష్ట స్థాయికి పడిపోతున్న తరుణంలో గ్రామాలలో సాగునీటికి తాగునీటికి ఇబ్బంది కలగకుండా కృష్ణా జలాలతో చెరువులు నింపుతున్న ఎమ్మెల్యే చొరవతో తమ గ్రామాలలోని చెరువులకు కృష్ణానది జలాలు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఉమ్మడి నల్గొండ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, తోటి నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల ప్రజలు ఉన్నారు.