calender_icon.png 13 March, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల భూములను గుంజుకోవద్దు: జాన్ వెస్లీ

12-03-2025 12:28:50 AM

యాచారం : మండల కేంద్రంలో కుర్మిద్ద గ్రామంలో మంగళవారం ఫార్మా భూ బాధిత రైతులతో సమావేశమై రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ. ఫార్మ సిటీ కోసం రైతులు ఆమోదం లేకుండా తీసుకున్న భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఫార్మా భూ సేకరణ 2016లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు 19300 ఎకరాలు తీసుకున్నారు. పట్టా భూమికి 12,50,000 అసెంటెడ్ భూమికి ఏడు లక్షల 45 వేల రూపాయలు మాత్రమే ఇచ్చి రైతులను ప్రభుత్వ మోసం చేసిందన్నారు.

2013 భూచట్టం ప్రకారం రైతులందరికీ మూడింతలు పరిహారం ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో ముందు కాం గ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తా అని చెప్పి, ఇప్పుడు గ్రీన్ సిటీ ఫోర్త్ సిటీ అని ప్రజలకు మాయమాటలు చెబుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి రైతులు అండగా నిలబడాలని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు,తదితరులు పాల్గొన్నారు.