calender_icon.png 28 October, 2024 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పని తెలిసి.. మద్యం తాగి బండి నడపొద్దు

28-10-2024 04:51:49 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురికి జరిమానా మరొకరికి జరిమానాతో పాటు జైలు శిక్ష

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలను నడపకూడదని తెలిసిన అలాగే తాగి యధావిధిగా నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎంతవరకు సమంజసము ఆలోచించవలసిన అవసరం ఉందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంతు రెడ్డి అన్నారు. ఎస్పీ జానకి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ టౌన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా నలుగురికి నగదుతో కూడిన జరిమానా వేయించడం జరిగింది.

మరొకరికి నగదు జరిమనతో పాటు రెండు రోజుల జైలు శిక్ష విధించడం జరిగిందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా ఐదుగురు పట్టుబడిన వారి కేసులను శివధర్  జడ్జి ఒకరికీ రూ.2000 ముగ్గురికి రూ.3000 చొప్పున మొత్తం రూ.13000 నగదు జరిమానా విధించగా మరొకరికి 2 రోజుల జైలు శిక్షా , రూ. 2000 నగదు జరిమానా విధించడం జరిగిందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంతు రెడ్డి తెలియజేశారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువవుతాయి, ఇది వాహనదారులనే కాకుండా ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తుందన్నారు.

అందుకే మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి కేసుల్లో ముందుగా వాహనదారులను అవగాహన కల్పించేందుకు మరియు సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పాటించడానికి సూచనలు చేస్తామనీ, కానీ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. చదువుకున్న వారు కూడా చాలామంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని ఇది సరైన విధానం కాదని తెలిపారు. తెలిసినవారు కూడా వాహనాలను మద్యం సేవించి నడపడం ఎంతవరకు కరెక్ట్ వారు ఆలోచించాలని తెలిపారు. వారి కుటుంబాలు వారిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.