కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రి పొన్నం
హుస్నాబాద్, అక్టోబర్ 13: మద్యం సేవించమని, మద్యం సేవించి వాహనాలు నడపమని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరిస్తామని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించమని రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ గుడి వద్ద కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్రంలో 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అనేక విజయాలు సాధించామన్నారు. రూ.2లక్షల రుణమాఫీ కాని రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించా రు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధ్దిలో ఆదర్శంగా నిలుపుతామన్నారు.
ఇక్కడి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. హుస్నాబాద్‌లో రామ్‌లీలా కార్యక్రమ ఏర్పా ట్లు చేసినవారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత, వైస్ చైర్‌పర్సన్ అనిత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.