calender_icon.png 12 February, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నచ్చిన ఉద్యోగం కాదు వచ్చినది చేయండి

12-02-2025 01:18:39 AM

  • నేడు నిర్వహిస్తున్న జాబ్ మేళాకు హాజరుకండి 
  • ఎన్టీఆర్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): నచ్చిన ఉద్యోగం కాదు వచ్చిన ఉద్యోగం ఏదైనా చేసి ముందుకు సాగాలని ఎన్టీఆర్ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ రాజేం ద్రప్రసాద్ డాక్టర్.హరిబాబు తెలిపారు.  ఎన్టీ ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ అటానమస్ కళాశాలలో శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ సహకారంతో కళాశాల తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్, ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12న జాబ్ మేళా కు నిర్వహిస్తున్నట్లు  పేర్కొన్నారు.

ఈ జాబ్ మే ళాలో  ఫాక్స్కాన్ కంపెనీలో 500 ఉద్యోగాల కోసం ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పదవ తరగతి చదివి 18 నుంచి 30 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలు మాత్రమే అరులని, మేళాకు పదోత రగతి సర్టిఫికెట్, ఆధార్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లు, పాస్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.