02-04-2025 01:07:51 AM
మహబూబ్ నగర్ ఏప్రిల్ 1 (విజయ క్రాంతి) : నాయకులు ఎవరైనా మందిరం మసీదుల దగ్గర రాజకీయం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రంజాన్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వానగుట్ట ఈద్గా దగ్గర ముస్లింలు చేసిన ప్రార్థనలో కార్యక్రమంలో భాగంగా పార్టీలకు అతీతంగా వచ్చిన నేతలకు ప్రత్యేక అధికారి ద్వారా ఆహ్వానం పలకడం జరిగిందని తెలిపారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుర్చీ ఇవ్వలేదని చెప్పడం అబద్ధమని, కుర్చీలలో ఎవరు పడితే వారు కూర్చుంటారని ఉద్దేశంతోనే కుర్చీలపై పేర్లు నమోదు చేస్తూ ప్రత్యేక అధికారి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజా ప్రణాల్లో అందరి సమానంగా చూడడం ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అగౌరపరచడం జరిగిందని ఆరోపణలు వాస్తవం కాదని తెలియజేశారు. అందరూ సమానమనే సాంకేతాన్ని తెలియజేస్తూ పండుగలు నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. మరో మరో ఇలాంటి ఆరోపణలు జరగకుండా చూడవలసిన అవసరం బిఆర్‌ఎస్ పార్టీ నేతలకు ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.