calender_icon.png 22 September, 2024 | 2:56 AM

ఏ ఒక్కరికీ అన్యాయం చేయం

22-09-2024 01:02:31 AM

మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయిస్తాం  

మంత్రి పొన్నం ప్రభాకర్

మలక్‌పేట, ఎల్‌బీ నగర్ ప్రాంతాల్లో పర్యటన

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులలో ఏ ఒక్కరికీ అన్యా యం చేయమని, మూసీ సుందరీకరణ పనులకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మూసీ అభివృద్ధిలో భాగంగా నివాసాలు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ను కేటాయించేందుకు మలక్‌పేట్, ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బలాలా, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రంగారెడ్డి, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జిల్లా కలెక్టర్ అనుదీప్  తదితరులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పర్యటించారు.

ఈ సందర్భం గా మలక్‌పేట్ నియోజకవర్గం పిల్లి గుడిసెలు, ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని భవానీపురంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి పరిశీలించారు. పిల్లి గుడిసెలు డబుల్ బెడ్‌రూం సముదాయంలో 146 ఇళ్లు, వనస్థలిపురం భవానీనగర్‌లో 90 ఇళ్లు ఖాళీగా ఉన్నట్టు మంత్రి గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఇమేజ్‌ను ప్రపంచస్థాయికి పెంచేం దుకు సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది తీరాన్ని టూరిజం హబ్‌గా మార్చనున్నట్టు తెలిపారు. మూసీ నది అభివృద్ధిలో భాగంగా గృహాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం డబుల్ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. పునరావాసం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

బాధిత మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో 3,500 మంది అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయనున్న ట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకటాచారి, ప్రతిమా సింగ్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పూజారి గౌతమి, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంక న్న, హౌసింగ్ సీఈ అనిల్ రాజ్ పాల్గొన్నారు.